Stock Market | మ‌దుప‌ర్ల హుషార్ – ఒక్క రోజే రూ.10 ల‌క్ష‌ల కోట్ల లాభం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ను గణనీయమైన లాభాలతో ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు, రోజంతా అదే ఉత్సాహాన్ని కొనసాగించి భారీ వృద్ధితో స్థిరపడ్డాయి. ఈ ఒక్క రోజే ఏకంగా రూ.10 ల‌క్ష‌ల కోట్లు లాభ‌ప‌డ్డారు మ‌దుప‌రులు.. కాగా ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,577.63 పాయింట్లు (2.22 శాతం) లాభపడి 76,734.89 పాయింట్ల వద్ద నిలిచింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీగా పుంజుకుంది. నిఫ్టీ 500.00 పాయింట్లు (2.25 శాతం) పెరిగి 23,328.55 వద్ద ముగిసింది.

ఈరోజు ట్రేడింగ్‌లో పలు కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
అయితే, కొన్ని కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. క్వెస్ కార్ప్, రాజ్ టెలివిజన్ నెట్‌వర్క్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

Leave a Reply