తిరుమల శ్రీవారికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవ భారీ విరాళం ఇచ్చారు. తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి విరాళం అందించారు. తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద రూ.17 లక్షల విరాళం ఇచ్చారు అన్నా లేజినోవ. మార్క శంకర్ పేరు మీద ఈ రోజు భక్తులకు మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించనుంది టీటీడీ పాలక మండలి.
కాగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యా న్ సతీమణి అన్నా కొణిదల గారు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదల కి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆమె శ్రీవారికి తలనీలాల సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.
https://twitter.com/JanaSenaParty/status/1911601192146489365