CSK vs KKR | కేకేఆర్ దెబ్బ‌కు.. చ‌తికిల‌ప‌డ్డ చెన్నై !!

చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైంది. చెన్నై పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో.. కేకేఆర్ బౌలర్లు చెలరేగారు.

దీంతో, టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన‌ చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు.

చెన్నై బ్యాట‌ర్లలో ఏ ఒక్క‌రు కూడా స్థాయికి త‌గ్గ బ్యాటింగ్ చేయ‌లేక‌పోయారు. శివం దూబే (31), విజ‌య్ శంకర్ (29) టాప్ స్కోర‌ర్ గా నిలిచారు.

ఇక కోల్‌కతా బౌలర్లలో స్పిన్నర్లు సునీల్ నరైన్ (3/13), వరుణ్ చక్రవర్తి (2/22), మోయిన్ అలీ (1/20) తిప్పేశారు. ఇక వైభ‌వ్ అరోరా (1/31), అర్హిత్ రాణా (2/16) కూడా రాణించ‌డంతో సీఎస్కే 103 పరుగులకే పరిమితమైంది.

దీంతో 104 ప‌రుగుల టార్గెట్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛేజింగ్‌కు దిగనుంది.

Leave a Reply