HYD | హనుమాన్ విజయ యాత్రకు భారీ బందోబస్తు : సీవీ ఆనంద్

హైద‌రాబాద్ నగరంలో ఈ శనివారం జరిగే వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వాహకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో హైదరాబాద్ నగర పోలీసులు బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు, జీహెచ్‌ఎంసీ, ఆర్&బి, టీజీఎస్‌ఆర్టీసీ, అగ్నిమాపక శాఖ, హెచ్‌ఎండబ్ల్యూఎస్&ఎస్బీ, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుందని.. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు
జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీర హనుమాన్ విజయ యాత్ర కోసం హైదరాబాద్ పోలీసులు అదనపు సాయుధ దళాలతో పాటు 17,000 మంది పోలీసులను మోహరించనున్నారు.

వారం రోజుల కిందట నగరంలో జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగిందని… అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ, కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అదేవిధంగా వీరహనుమాన్ విజయయాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు

ఊరేగింపులో కొత్తగా ఎవరైనా వ్యక్తులు చేరితే అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిర్వాహకులను కోరారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు.

నిర్వాహకులు డీజే వల్ల కలిగే నష్టాలు తెలుసుకోవాలిని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నిర్వాహకులు పెద్ద స్పీకర్లు పెట్టుకోవచ్చు కానీ డీజేలను అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసు శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల వాడకాన్ని నిషేధించారని కూడా స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు, పోస్టులు పెట్టకూడదు అని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు హెచ్చరించారు. రెండో శనివారం కావడంతో సెలవు ఉంటుందని, దాంతో పాటు ఆరోజు ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉందని రాచకొండ పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ ల నుండి కూడా ఈ విజయయాత్రలో పాల్గొంటారు. పోలీసులు నిర్వాహకులతో అందుబాటులో ఉండి శనివారం జరగనున్న హనుమాన్ విజయయాత్రను సక్సెస్ చేయాలి అని ఆయన సూచించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆసక్తి ఉన్నవారు విజయయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. కనుక యాత్ర నిర్వాహకులు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సహకరించాలి.

వాతావరణశాఖ సూచన ప్రకారం ఆరోజు హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉంటూ వాటర్ లాగిన్ పాయింట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *