ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో సూపర్ ఫామ్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్.. ఈరోజు రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తడబడుతోంది. రాజస్థాన్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ టాపార్డర్ కుప్పకూలింది. దీంతో పంజాబ్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఇక ప్రస్తుతం క్రీజులో నేహాల్ వధేరా (31) – మాక్స్ వెల్ (15) ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో 10 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది.
అంతకముందు ఔటన వారిలో ప్రియాంష్ ఆర్య ఇంపాక్ట్ ప్లేయర్ (0), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10), మార్కస్ స్టోయినిస్ (1), ప్రభసిమ్రాన్ సింగ్ (17) ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ పడగొట్టారు.