LSG vs MI | దుమ్మురేపిన ల‌క్నో.. ముంబై పై థ్రిల్లింగ్ విక్ట‌రీ !

సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్ట‌రీ సాధించింది. అయితేచ‌ చివరి బంతి వరకు పోరాడిన ముంబైకి ఓటమి తప్పిలేదు. ఈ మ్యాచ్‌లో అన్ని విధాలుగా రాణించిన లక్నో జట్టు మరోసారి ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.

కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో.. ముంబై ముంది 204 ప‌రుగుల టార్గెట్ నిర్ధేశించ‌గా.. ఆ ఛేద‌న‌లో ముంబై పోరాడి 12 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. ల‌క్నో బౌల‌ర్ల‌ను, ఫీల్డ‌ర్లు క‌ట్ట‌డి చేయ‌డంతో ముంబై జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ముంబై బ్యాట‌ర్ల‌లో ఓపెనర్లు విల్ జాక్స్ (5), ర్యాన్ రిక‌ల్ట‌న్ (10) విఫ‌ల‌మైనప్ప‌టికీ.. ఆ త‌రువాత వ‌చ్చిన బ్యాట‌ర్లు న‌మ‌న్ ధీన్ (46), తిల‌వ్ వ‌ర్మ‌(25 రిటైర్డ్ ఔట్) రాణించ‌గా.. సూర్య‌కుమార్ య‌ద‌వ్ (67) హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. ఇక ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో పొరాడిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28).. కావాల్సిన ప‌రుగులు సాధించ‌లేక పోయాడు. ఇక లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక అంత‌క‌ముందు బ్యాటింగ్ లో ల‌క్నో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు సాధించింది. మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క‌ర‌మ్ (53) అర్ధ శ‌త‌కాల‌తో విరుచుకుప‌డ్డారు. ఆయుష్ బ‌దోని (30), డేవిడ్ మిల్ల‌ర్ (27) రాణించారు. ఇక ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పాంచ్ ప‌ట‌కాతో అద‌ర‌గొట్టాడు.

అయితే, ముంబైపై విజయంతో లక్నో జ‌ట్టు పాయింట్ల పట్టికలో 6 నుండి 7కి ఎగబాకింది. మ‌రోవైపు ఈ ఓట‌మితో ముంబై 6 నుండి 7కి పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *