ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’ విద్యార్థుల ప్రభంజనం..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’ విద్యార్థుల ప్రభంజనం..

భీమారం, ఆంధ్ర ప్రభ : స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అవని కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్ల కళాశాల ప్రిన్సిపాల్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీలో మొదటి సంవత్సరం విద్యార్థులు బి ధర్మతేజ 468, డి ధనుష్ 468, ఆర్. వరుణ్ 467, కే. కార్తీక్ 467, శ్రీ చందన 466, బి.సాత్విక్ 466,కే. రామ్ చరణ్ 466, ఎం. శ్రీనాథ్ 466, బైపీసీలో టీ.గణేష్ 436,జి.వివేక్ 436,జి.శివాని 435, సి.ఈ. సి లో ఏ. రామ్ చరణ్ 482, పి హిమబిందు 479 మార్కులు లతో పాటు 20 మంది విద్యార్థులు 460 మార్కులు, 10మంది విద్యార్థులకు పైగా 470 పైన మార్కులు సాధించినట్లు తెలిపారు.

నిర్దిష్టమైన ప్రణాళిక, విద్యార్థుల కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం అధ్యాపకుల సమిష్టి కృషివల్లే రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించామని సెక్రటరీ కరస్పాండెంట్ రాము అన్నారు.ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను షైన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జక్కుల శ్రీనివాస్, అవని డైరెక్టర్లు తోట రఘు, ఏ.సంతోష్, జె దయాకర్, జె.ఏకాంతం,ఎం.రాజ్ కుమార్, జి. రాజు ల తో పాటు అధ్యాపకులు అభినందించారు.

Leave a Reply