Reservations | కేంద్రమంత్రి బండిసంజయ్

Reservations | కేంద్రమంత్రి బండిసంజయ్

Reservations | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లుతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళా పార్టీలన్నీ పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతివ్వాలని ఆయ‌న కోరారు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మున్ముందు మ‌హిళ‌లే గుణపాఠం చెబుతారన్నారు. మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక మహిళా రిజర్వేషన్ బిల్లు అని అభివర్ణించారు. పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనన్న ఆయన డీలిమిటేషన్‌తో పార్లమెంట్‌లో స్థానాలు పెరుగుతాయని వివరించారు. తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయన్నారు.

Leave a Reply