నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సునీత..

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సునీత..
రాప్తాడు, ఆంధ్రప్రభ : పంచాయతీ రాజ్ రెవెన్యూ విభాగాల్లో ఇటీవల ఎక్కువగా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వీటి పై అధికారులు దృష్టి సారించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. టిడిపి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.రాప్తాడు నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.ఇందులో ప్రధానంగా పంచాయతీరాజ్ విభాగంలో ఎక్కువగా 21 రెవెన్యూ విభాగంలో 17 అర్జీలు వచ్చాయి.
ఇరిగేషన్ కి సంబంధించి 5 ఆర్.అండ్.బి విభాగానికి సంబంధించి 3 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఒక్కరితో ఎమ్మెల్యే సునీత ఓపిగ్గా మాట్లాడి సమస్యలు విన్నారు.కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వాటిని నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రజలు ఒకసారి ఇచ్చిన అర్జీలకు కచ్చితమైన పరిష్కారం ఉండాలన్నారు.వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు.

ఇందుకు అవసరం మేరకు నిధులు కూడా సిద్ధం చేయాలన్నారు. భూసమస్యల మీద ఇరు పక్షాలు చర్చించి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిదన్నారు.మరోవైపు ఆన్ లైన్ రికార్డుల మార్పుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి దిశగా రూపొందించిన స్వర్ణ రాప్తాడు మార్చి నెల న్యూస్ లెటర్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవిష్కరించారు. ఈ న్యూస్ లెటర్‌ను నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక విభాగం వాళ్ళు తయారు చేశారని తెలిపారు.ఇందులో నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న ప్రగతి కార్యక్రమాలను ప్రతిబింబించేలా అంశాలను పొందుపరిచారని ఉన్నారు.
పారదర్శకత ప్రజలతో అనుసంధానం మరియు అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఒక ముఖ్యమైన అడుగు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు ఎస్సీ సెల్ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి రొద్దం ముత్యాలప్ప క్లస్టర్ ఇన్చార్జిలు సోమరనారాయణ స్వామి సిసి రాము మహిళలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
