రాచూరులో కాఫీ విత్ క్యాడర్..

రాచూరులో కాఫీ విత్ క్యాడర్..
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండల కేంద్రం నారనాగేపల్లి పంచాయతీ పరిధిలోని రాచూరు గ్రామంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ “కాఫీ విత్ క్యాడర్” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. నాడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది సంక్షేమ పథకాల ద్వారా ఎలాంటి లోటు లేకుండా లబ్ధి చేకూరిందని ఆమె గుర్తు చేశారు.
ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి, లేనిపోని హామీలతో గెలిచి అనంతరం తీవ్ర అన్యాయం చేసిందని గ్రామ ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంలో అందిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రొద్దం మండల ప్రజాప్రతినిధులు, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారనాగేపల్లి పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.
