విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థాయిలో రాణించాలి..

విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థాయిలో రాణించాలి..

సువిద్య డిగ్రీ కళాశాల వీడ్కోలు పార్టీ సమావేశంలో ఎస్సై సతీష్..

చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో రాణించాలని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ కోరారు. బుధవారం సువిద్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు వీడ్కోలు పార్టీ సమావేశం ప్రిన్సిపాల్, కందికొండ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్, చిట్యాలసర్పంచ్, తౌటం లక్ష్మి, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, తవుటం నవీన్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మేకల రమేష్, వాణి విధ్యానికేతన్, కరస్పాండెంట్ బండి సంపత్ కుమార్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా, తల్లిదండ్రుల ఆశయ సాధనకు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో రాణించాలని కోరారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు, డ్యాన్సులు , పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Leave a Reply