Ham Roads | ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం….

Ham Roads | ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం….

Ham Roads | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్‌ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాల ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కాంగ్రెస్‌ తరపున కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రతిపక్ష నేతలు అబద్ధాలు ప్రచారం చేశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

శాసనసభను దేవాలయంతో పోల్చుతూ, అలాంటి పవిత్ర స్థలంలో బీఆర్‌ఎస్ నేతలు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.

సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అదే చూసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బీఆర్‌ఎస్ ఉనికి పోతుందని భయంతో కోమటిరెడ్డిపై కూడా తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

గతంలో తమపై వచ్చిన ఆరోపణలను ప్రస్తుత మంత్రులపై మోపాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి విధానం ప్రజలందరికీ సమాన న్యాయం జరిగేలా రూపొందించామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply