నీటి సరఫరా పర్యవేక్షణ, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

నీటి సరఫరా పర్యవేక్షణ, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి…

గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని హరిజన కాలనీ మరియు వాలివర్తిపాడు రోడ్డులో మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డైఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నీటి సరఫరా వ్యవస్థను పరిశీలిస్తూ, రెసిడ్యువల్ క్లోరినేషన్‌ను పరీక్షించారు. హరిజన కాలనీ, వాలివర్తిపాడు రోడ్డులో నీటి పైప్‌లైన్‌లలో లీకేజీలు ఉన్నాయా అనే విషయాన్ని తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. లీకేజీలు పూర్తిగా గుర్తించే వరకు పైప్‌లైన్‌లను ఒక్కొక్కటిగా నిలిపివేసి, కాలుష్యం కలిగిన పైప్‌లైన్‌ను గుర్తించాలని సూచించారు. అలాగే, ఆ సమయంలో నీటి సరఫరా నిలిపివేయబడిన గృహాలకు తాగునీరు అందించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని కమిషనర్ గారు ఆదేశించారు.

అదేవిధంగా, కాలనీలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను కూడా కమిషనర్ గారు పరిశీలించారు. చెత్త సేకరణ, వీధుల శుభ్రత, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

Leave a Reply