ప్రభుత్వ విప్ గా పెద్దపల్లి ఎమ్మెల్యే

ప్రభుత్వ విప్ గా పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్ గా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు విప్ లను ప్రభుత్వం నియమించగా, పెద్దపల్లి ఎమ్మెల్యేకు కూడా ఇందులో చోటు దక్కింది. గతంలో ఒక సారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, తిరిగి రెండవసారి గెలిచిన విజయరమణారావుకు మొదట్లోనే ఉన్నత పదవీ దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు.
సమీకరణల నేపథ్యంలో కొంత ఆలస్యమైనా సమర్ధతకు పార్టీ నాయకత్వం పట్టం కట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు విప్ గా పదవీ బాధ్యతలు అప్పగించడం పట్ల పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విప్ గా నియామకమైన విజయరమణారావుకు శుభాకాంక్షలు తెలిపారు.
