గ్యాస్ పై దళారుల మోసాలు

గ్యాస్ పై దళారుల మోసాలు

గ్యాస్ స్టాక్ పూర్తిగా ఉన్నదని ప్రభుత్వం ప్రకటిస్తున్న
గ్యాస్ ఏజెన్సీ దళారులు కుమ్మక్కై పక్కదొవ పట్టిస్తూనా వైనం

ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలలో గ్యాస్ ఏజెన్సీలు దళారులు కుమ్మక్కై ప్రజలకు గ్యాస్ లేదని కృత్రిమంగా తిప్పలు పెట్టిఇస్తూ గ్యాస్ లేనట్లుగా ఏజెన్సీలు సిబ్బందులు నటించడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు వాపోతున్నారు. గురువారం గ్యాస్ ఏజెన్సీలకు గ్యాస్ వినియోగదారులు ఆయా ఏజెన్సీల బుకింగ్ నంబర్లు అప్పజెప్పి ఆ నంబర్లకు ఫోన్ చేసినా రిసీవ్ చేసే నాథుడే లేనట్టుగా నటించడం సరి అయినదేనా అనిప్రశ్నార్థకంగా మిగిలింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరాన్ గుండా భారత్ జెండా కలిగిన కంటైనర్లు వస్తున్నాయి అని ప్రకటించడం ఒకవైపు జరుగుతా ఉంటే మరోవైపు గ్యాస్ దళా రూలు కృత్రిమ శార్టేజ్ లను ఆసరాగా తీసుకొని వీరికి మూడు పువ్వులు ఆరు కాయల చందాల తయారైతు తమ జేబులను నింపుతున్నారు. ఇది ఇలా ఉంటే హోటల్ గ్యాస్ సిలిండర్లకు అయితే ఆమడ దూరం దీంతో ఆయా హోటల్లు మూసుకుపోయే సమస్యగా నిలుస్తుంది ఉజ్వల గ్యాస్ కైతే అడ్రస్ లేదు ఈ విషయంపై ఉత్తర రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి పక్కదోవ పడుతున్న గ్యాస్ సిలిండర్లకు, అక్రమ స్టాక్ ఉంచుకున్న వారిపై కొరడాలను జూలిపించి ప్రజలకు న్యాయం చేస్తున్నారు.

ఈ ప్రకారం గానే మన ప్రాంతం లో సైతం సంబంధిత అధికారుల ప్రత్యేక బృందాన్ని ఏర్పరిచి తనిఖీలు నిర్వహిస్తే అక్రమ స్టాకులు అక్రమ సిలిండర్లు బయటపడీ ప్రజలకు గ్యాస్ అందేటట్లుగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే ఆయా గ్రాముల గ్యాస్ సిలిండర్ ఏజెంట్లను ఏజెన్సీ వారు వీరికి అప్పగిస్తూ సిలిండర్ వెనుకాల వందల రూపాయల కమిషన్ అదనంగా తీసుకోవడం జరుగుతుంది. వీరు సైతం ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్ యుద్ధాలను ఆసరాగా తీసుకొని గ్యాస్ సిలిండర్ పై అధిక రుసుమును తీసుకుంటూ తమ జేబులు గరం చేస్తున్నారు దీనిపై ప్రత్యేక నిఘా ఎంతో అవసరంగా ప్రజలు భావిస్తున్నారు.

Leave a Reply