అంబులెన్స్‌లో ప్రసవం..

దమ్మపేట, ఆంధ్రప్రభ : అంబులెన్స్ లో మహిళ ప్రసవించిన ఘటన దమ్మపేట మండలపరిధిలోని గండుగులపల్లిలో గురువారం జరిగింది .దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనలతో బాధపడుతుండగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దమ్మపేట 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. ఈఎమ్ టి చీమల రాము పరీక్షించగా ఆమెకు తీవ్ర ప్రసవ వేదనలు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆమెను అంబులెన్స్‌లోకి తీసుకుని వైద్య పరీక్షలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా కృష్ణకుమారి ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే సురక్షితంగా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ,ఆరోగ్యంగా ఉన్నారు .అనంతరం సమీప దమ్మపేట ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో సమ్యస్ఫూర్తితో వ్యవహరించిన ఈ ఎమ్ టి చీమల రాము , పైలట్ లాల్సింగ్ను స్థానికులు అభినందించారు.
