కలెక్టర్ ను కలిసిన ఆలేరు బిఆర్ఎస్ నేతలు

కలెక్టర్ ను కలిసిన ఆలేరు బిఆర్ఎస్ నేతలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ, మండల పరిధిలోని గ్రామాలలోని ఇండ్లు, నాట్లు, భూములను ప్రొహిబిటెడ్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఆలేరు బిఆర్ఎస్ నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని కలెక్టర్ కు వారు వివరించారు.

మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గ్యాద పాక నాగరాజు, మండల బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రచ్చ రాంనరసయ్య, కౌన్సిలర్లు కోమల్ల మౌనిక, బీజని కళ్యాణి, యాట శివకుమార్, నాయకులు ఏం డి ఫయాజ్, బీజని మధు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply