కరెంట్ షాక్‌తో యువకుడు మృతి..

కరెంట్ షాక్‌తో యువకుడు మృతి..

దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది.దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం .నంబాల గ్రామానికి చెందిన దాసరి చంద్రశేఖర్ (28) బుధవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న చంద్రశేఖర్ ఆకస్మిక మరణంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply