temple | దేవదేవునికే రక్షణ కరువు….

temple | దేవదేవునికే రక్షణ కరువు….
కాల్వబుగ్గ దేవాలయంలో భారీ చోరీ.
9.5 కేజీల వెండి అపహరణ.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.
temple | ఓర్వకల్, ఆంధ్రప్రభ : కాల్వబుగ్గలో వెలసిన శ్రీ బ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామికే రక్షణ కరువైంది. ఆరు నెలల రోజుల్లోనే రెండోసారి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. మొదటిసారి జరిగినప్పుడే అధికారులు సరైన చర్యలు తీసుకోలేక పోవడం విచారమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలోని శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారు జామున భారీ చోరీ జరిగింది. ఉదయాన్నే గుడి తెరిచేందుకు అర్చకులు రావడంతో వెనకవైపు తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే సమాచారం ఈవో మద్దిలేటి కి అందజేశారు.
చేరుకున్న ఈవోమద్దిలేటి ఎస్సై సునీల్ కుమార్ కు సమాచారం అందించారు. ఎస్సై పరిశీలించిన అనంతరం డిఎస్పి కి సిఐ కి సమాచారం అందించడంతో వారు పరిశీలించి ఎస్పీకి సమాచారం అందించారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎస్పీ విక్రాంత్ పార్టీ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు సిసి ఫుటేజీలను పరిశీలించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబికా బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో నలుగురు దుండగులు ఆలయ ఆవరణలోకి ప్రవేశించారు.

వారిలో ఒకరు కట్టర్ సహాయంతో ఆలయ తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడి విలువైన వెండి ఆభరణాలను దొంగిలించుకొని వెళ్లారు. దుండగులు స్వామివారి వెండి నాగపడగ, ద్వారపాత్ర, అమ్మవారి వెండి పీఠం, సింహం వంటి వెండి వస్తువులను అపహరించారు. మొత్తం సుమారు 9.5 కిలోల వెండి వస్తువులు దొంగిలించబడినట్లు ఆలయ అధికారులు తెలిపారు అని అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు ప్రస్తుత రేటు పరిస్థితి అయితే 18లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దేవాలయంలో వాచ్మెన్ లేకపోవడం సిబ్బంది లేకపోవడం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సరైన చర్యలు చేపక చేపట్టకపోవడం బాధాకరమని భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
