బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం ఆశయాలను సాధించాలి
బీఎస్పీ నేతలు శ్రీరామ్ కృష్ణ, సుభాష్ చంద్రబోస్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్సిరాం ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ కృష్ణ పిలుపునిచ్చారు. కాన్సిరాం 92వ జయంతి వేడుకలను చౌటుప్పల్ మండలంలో ఆదివారం పార్టీ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఎస్పి నేతలు శ్రీరామ్ కృష్ణ, సుభాష్ చంద్రబోస్ లు మాట్లాడుతూ నూటికి 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి పొరాడి రాజ్యాధికారం సాధించిన ఘనత మహనీయుడు కాన్సిరాం కే దక్కిందని అన్నారు. కాన్సీరామ్ ఆశయాలను సాధించేందుకు ఆయన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పలువురు బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఊదరి వెంకటేష్ మహాజన్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్, నాయకులు కట్టెల లింగస్వామి, సుక్క అర్జున్, బద్రి గాలయ్య, బోయ అంబేద్కర్, సంపత్, బోదుల ప్రశాంత్, బీసీ సంఘం నాయకులు కంచర్ల జంగయ్య పాల్గొన్నారు.
