పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి..

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి..
సిర్పూర్ (యు), ఆంధ్ర ప్రభ : ఈ నెలలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పంగిడి పంచాయతీ సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా అన్నారు. బుధవారం పంగిడి ఆశ్రమో న్నత పాఠశాల లో పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలను భయపడకుండా నిర్భయంగా రాయాలని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భగవంత రావు, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
