భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య…

భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య…
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, కవిత భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై జరిగిన వాగ్వాదం కారణంగా భర్త నాగేశ్వరరావు కవితను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
