మొబైల్ మెడికల్ క్యాంప్ కు ఆదరణ..

మొబైల్ మెడికల్ క్యాంప్ కు ఆదరణ..

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని విద్యాధరపురంలో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన వచ్చింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 44 డివిజన్ చెరువు సెంటర్ లోని మర్రి చెట్టు వద్ద సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.. శని, ఆది వారాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపులో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు..

క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో, అల్ట్రా స్కానింగ్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.. అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా దంత సమస్యలు ఉన్న వారికి దంత పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన వైద్య సహాయం కూడా అంద చేశారు..

పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు.. కార్యక్రమాన్ని సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పర్యవేక్షించారు.. ప్రతి శని, ఆది వారాల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఈ క్యాంప్ లు నిర్వహిస్తామని , ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. పీవీఆర్ హాస్పటల్ చైర్మన్ పీ .వెంకట్రామ చౌదరి, డివిజన్ బిజెపి అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజు, స్థానిక కార్పొరేటర్ మైలవరపు దుర్గారావు, కూటమి నాయకులు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వీరమాచినేని కిరణ్, వెంకట రమణ, హరీష్ లతో పాటు సుజనా మిత్ర లు పాల్గొన్నారు.

Leave a Reply