ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక..
పట్టణ సమస్యల ను పరిష్కరించడానికి ప్రజా పాలన ప్రగతి
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలో సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక దోహద పడుతుందని చైర్మన్ పందిరి గీత అన్నారు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో 12వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా శుక్రవారం మొదటిరోజు మునిసిపల్ చైర్మన్ పందిరి గీత కమిషనర్ దండు శ్రీనివాస్ లు పట్టణ ప్రగతి పై 12వ వార్డులో గల హైస్కూల్ వెనకాల ఏర్పాటు చేసిన వేదికపై నుండి కౌన్సిలర్లు వార్డు ప్రజలు మున్సిపల్ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేసి అనంతరం ర్యాలీ నిర్వహించి స్వయంగా చైర్మన్ పందిరి గీత చీపురు పట్టుకొని పరిసరాలను శుభ్రం చేశారు.

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మార్చి 6 నుండి జూన్ 12 వరకు మున్సిపాలిటీ లో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన కల్పించడం జరుగుతుందని ముఖ్యంగా పారిశుధ్యం, వేసవికాలంలో నీటి ఎద్దడి, విద్యుత్ స్తంభాలు, ప్రజలకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండు శ్రీను, వైస్ చైర్మన్ గుండమైన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తదితరు పాల్గొన్నారు.
