నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ ఓ ఫంక్షన్ హాల్ లో చింతకుంట రామయ్య పల్లికి చెందిన బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు సాద మల్లయ్య– రమ దంపతుల కుమార్తె సత్య శ్రీ- రాజు ల వివాహానికి హాజరై నూతన దంపతులను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, మాజీ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ మండల ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్రావు, పి ఎస్ ఎస్ మాజీ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు తవుటం నవీన్, మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య, ఆది రఘు, వేముల శ్రీనివాస్, అశోక్, లింగారెడ్డి రాజు, శ్రీనివాస్, కిరణ్, స్వామి రావు, స్వామి రావు లక్ష్మయ్య చిన్న రాములు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
