Notification | దరఖాస్తు చేసుకోండి

Notification | దరఖాస్తు చేసుకోండి

  • నార్‌సెట్‌తో నియామకాలు
  • ఎంపికైనవారికి మొదటి నెల నుంచే రూ.85,000కు పైగా జీతం

Notification | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : మీరు నర్సింగ్​ చేశారా? కేంద్ర ప్రభుత్వ నర్సింగ్​ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ శుభవార్త మీకోసమే. ఇంకెందుకు ఆలస్యం త్వ‌ర‌గా అప్లికేషన్ విధానాన్ని ఫాలో అవ్వండి.

కేంద్రం ఆధ్వర్యంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్​) వంటి పలు జాతీయ వైద్య సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో దేశవ్యాప్తంగా 2551 ఖాళీలు ఉన్నాయి.

అప్లై చేసుకోవ‌డానికి అర్హ‌త‌ : బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసినవారు ఇందుకు అర్హులవుతారు. నర్సింగ్ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నార్‌సెట్‌)తో నియామకాలుంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు మొదటి నెల నుంచే రూ.85,000కు పైగా జీతాన్ని పొందవచ్చు. నర్సింగ్​ పోస్టులలో 80 శాతం మహిళలతో, 20 శాతం పురుషులను తీసుకుంటారు. ఈ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్​ ఉంటాయి. ఈ రెండింటిలో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్లు పరిశీలించి, అభ్యర్థుల ప్రాధాన్యం ప్రకారం పోస్టులు ఇస్తారు.

ఇందులో అర్హతకు జనరల్, ఈడబ్ల్యూఎస్‌లు 50 శాతం, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. దివ్యాంగులైతే కేటగిరీ అనుసరించి అదనంగా మరో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. సబ్జెక్టు నుంచి అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్ల సిలబస్‌ నుంచే ఉంటాయి.

మెయిన్స్‌ : ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారి జాబితా నుంచి కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలకు 5 రెట్ల మందికి మెయిన్స్‌కు అవకాశం కల్పిస్తారు. 160 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచే ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. ఈ పరీక్ష టైం 3 గంటలు. దీన్ని 4 సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్‌లోనూ 40 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారీ వ్యవధి 45 నిమిషాలు. ఇందులో అర్హతకు జనరల్, ఈడబ్ల్యూఎస్‌లు 50 శాతం, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. దివ్యాంగులైతే వారి కేటగిరీ అనుసరించి అదనంగా మరో 5 శాతం సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక వాధానం : పరీక్షలో అర్హత సాధించినవారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. తర్వాత మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థుల ప్రాధాన్యం ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. వీరికి పే స్కేల్‌ లెవెల్‌ 7 ప్రకారం రూ.44,900 మూలవేతనం అందిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ కూడా అదనంగా లభిస్తాయి. అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ.85,000 వేతనం అందుకోవచ్చు. నోటిఫికేషన్‌లో 2551 పోస్టులు ప్రకటించినప్పటికీ కొన్ని ఎయిమ్స్‌ల్లో ఖాళీల వివరాలు పేర్కొనలేదు. అందువల్ల నియామకాల సమయానికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు.

ఎయిమ్స్‌ కేంద్రాలు : బఠిండా, భోపాల్, భువనేశ్వర్, బీబీనగర్, బిలాస్‌పుర్, దియోఘర్, గోరఖ్‌పుర్, జోధ్‌పుర్, కల్యాణి, మంగళగిరి, నాగ్‌పుర్, న్యూదిల్లీ, పట్నా, రాయ్‌ బరేలీ, రాయ్‌పుర్, రాజ్‌కోట్, రిషికేష్, విజయ్‌పుర్‌ (జమ్మూ), అవంతిపుర. ఈ స్కోరుతో ఎయిమ్స్‌లతోపాటు జిప్మర్‌-పుదుచ్చేరి, ఈఎస్‌ఐసీ, ఇతర ముఖ్య సంస్థల్లోని ఖాళీలనూ పూర్తి చేస్తారు.

Notification |

Notification | ఇతర వివరాలు ఇలా :

అర్హత: బీఎస్సీ నర్సింగ్‌ / పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు : 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం పది నుంచి పదిహేనేళ్లు సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు : మార్చి 16 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.2400. దివ్యాంగులకు ఉండదు.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: స్టేజ్‌-1: 11.04.2026, స్టేజ్‌-2: 30.04.2026
వెబ్‌సైట్‌: https://aiimsexams.ac.in/

Notification |

Leave a Reply