బీజేపీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు

బీజేపీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు

నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికి ఒకరు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచే హోలీ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషకరమని మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య యువ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply