అక్రమ కలప పట్టివేత

అక్రమ కలప పట్టివేత
దండేపల్లి, ఆంధ్రప్రభ: దండేపల్లి మండలంలోని మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందుతులు ఊట్ల గ్రామం నుండి దండేపల్లికి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో మాటు వేసి బైకును వెంబడించగా కలప స్మగ్లర్ బైక్ వదిలి పెట్టి పరారయ్యారు.
25వేల విలువ గల నాలుగు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మెదరిపేట సెక్షన్ ఆఫీసర్ రాజేందర్ తెలిపారు. పట్టుకున్న కలప, బైక్ ను తాళ్ల పేట రేంజ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు, ఈ కార్యక్రమంలో,ఫారెస్టు బీట్ ఆఫీసర్ మధు,చిన్నయ్య,బేస్ క్యాంపు వాచర్ తదితరులు పాల్గొన్నారు.
