క్విజ్ పోటీలో విద్యార్థుల ప్రతిభ

క్విజ్ పోటీలో విద్యార్థుల ప్రతిభ
నగదు ప్రోత్సాహకం అందించిన మాజీ ఎంపిటిసి
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ క్విజ్ పోటీల్లో ఉట్నూర్ మండలంలోని సాలెవాడ( కె )జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ద్వితీయ బహుమతి పొందినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోజ్ రెడ్డి, ఉపాధ్యాయులు జాదవ్ రవి కుమార్ తెలిపారు. జిల్లాస్థాయి ద్వితీయ బహుమతి పొందిన తమ విద్యార్థులకు సాలెవాడ మాజీ ఎంపీటీసీ సాల్గరే రవీందర్ 5000 రూపాయల ప్రోత్సాహక బహుమతి సోమవారం తమ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందించాలని వారు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని మరిన్ని బహుమతులు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాలెవాడ( కే) జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు జాదవ్ రవికుమార్, గౌతమ్, సంగీత, శేషారావు విద్యార్థులు పాల్గొన్నారు.
