సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది వివిధ అనారోగ్యాల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకుని భారీగా మెడికల్ ఖర్చులు అయ్యాయి. అనంతరం ఆ మెడికల్ బిల్లులను స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తులు పంపించగా, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన రూ 10,10,281 విలువైన చెక్కులను సోమవారం జగ్గయ్యపేట పట్టణంలోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో తోడ్పాటు అందిస్తున్నదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
