సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ, మేయర్

సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన మంత్రి కొండ సురేఖ, మేయర్

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
కోటి నలభై లక్షల నిధులతో సిసి రోడ్ల శంకుస్థాపన
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ

కరీమాబాద్,ఆంధ్రప్రభ: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వితీయమని రాష్ట్ర దేవాదాయ అటవీశాఖ మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు అన్నారు. ఆదివారం బల్దియా పరిధి 40 వ డివిజన్ లో స్టాంప్ డ్యూటీ నిధులు కోటి 40 లక్షల రూపాయల వ్యయం తో నిర్మించనున్న సిసి రోడ్డు, ఉర్స్ స్మశాన వాటిక, అసంపూర్తిగా ఉన్న గౌడ సంఘం, మైనార్టీ కమ్యూనిటీ హాల్ పనులకు, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,వరంగల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలసి మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు శంకుస్థాపన చేసినారు . కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి, మాజీ కార్పొరేటర్ బత్తిని వసుంధర, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ తూర్పు నియోజకవర్గం లోని జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12, 33వ డివిజన్లలో నూతన నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద లతో కలసి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. దేశాయిపేట్ తుమ్మలకుంట లబ్ధిదారులైన ఆడెపు కల్పన ప్రవీణ్ కుమార్,దంపతులకు, పెరకవాడలోని నరహరిశెట్టి రమాదేవి కుటుంబ సభ్యులకు మంత్రి నూతన వస్త్రాలను అందజేసి అభినందించారు.

కార్యక్రమంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ ముష్క మల్ల అరుణ సుధాకర్. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply