deadly explosion : అదే సూర్య‌శ్రీ Andhra Prabha Crime Story

deadly explosion : అదే సూర్య‌శ్రీ Andhra Prabha Crime St

  • అత‌డే య‌జ‌మాని
  • మ‌ళ్లీ ఘోర ఖ‌లి
  • భారీ విస్పోట‌నమే సాక్ష్యం
  • 12 ఏళ్ల కింద‌ట 17 మంది స్పాట్
  • ఈ రోజు 20 మంది బుగ్గి
  • శాశ్వ‌త ర‌ద్దు లైసెన్స్ బ‌తికింది ఎలా?
  • ఇదీ వేట్ల‌పాలెం విస్పోట‌న కార్ఖానా క‌థ

( ఆంధ్ర‌ప్ర‌భ‌, ఏపీ న్యూస్ నెట్ వ‌ర్క్ ప్ర‌తినిధి)

వేట్ల‌పాలెం.. అంటే.. అది విస్పోట‌న కార్ఖానా. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామం బాణాసంచా తయారీకి ఒక ప్రధాన కేంద్రం. ఇక్కడ పదుల సంఖ్యలో చిన్న, పెద్ద యూనిట్లు ఉన్నాయి. వీటిలో సూర్య‌శ్రీ ఫైర్ వ‌ర్క్స్ కీల‌కం. దాదాపు 2 ఎక‌రాల్లో ఈ కంపెనీ న‌డుస్తోంది. ఇక్క‌డే జ‌నం నోరు వెళ్ల‌బెట్టే ఇంకోట్విస్టు ఉంది. ఇదే కంపెనీ.. ఇత‌డే య‌జ‌మాని.. ఘోర ప్ర‌మాదాలు రెండు. జ‌నం ఎంత మంది చ‌చ్చినా ప‌ర్వాలేదు.. కంపెనీ లాభాలు త‌గ్గ‌కూడదు. మార్చిలో త‌ప్పితే సెప్టెంబ‌రు లేదా… అన్న‌ట్టు లైసెన్స్ పోతే మ‌రో లైసెన్సు రాదా? బాణాసంచా దందా చేస్తుంటే… అధికారులు మాత్రం అదే కంపెనీకి లెసెన్సులు క‌ట్ట‌బెడుతున్న అధికారుల మామూళ్ల సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే..

వేట్ల‌పాలెం సూర్య‌శ్రీ ఫైర్ వ‌ర్క్స్‌.. కంపెనీ.. ఇప్ప‌టికి 39 మందిని బ‌లి తీసుకుంది. ఎలా అంటే.. 2014 అక్టోబ‌రు 20న భారీ విస్పోట‌నంలో 17 మంది దుర్మ‌ర‌ణం చెందారు. 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అంటే.. 12 సంవ‌త్స‌రాల కింద‌ట ఈ ఘోరం జ‌రిగింది. కానీ య‌జ‌మాని బుద్ధి మార‌లేదు. మ‌ళ్లీ ఈ రోజున పాత క‌థే ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ సారి మృతుల సంఖ్య పెరిగింది. ఈ రెండు ప్ర‌మాదాల్లోని మృతు్లో్ అత్య‌ధికులు మ‌హిళా కూలీలే. ఈ రెండు ఘ‌ట‌న‌ల్లోనూ ప్ర‌భుత్వం ఏరీతిలో ప్పందించిందో.. ప‌రిశీలిద్దాం,

deadly explosion: 18 మంది అక్క‌డిక‌క్క‌డే…

వేట్ల పాలెం.. శ‌నివారం ఉద‌యం సూర్య‌శ్రీ ఫైర్ వ‌ర్క్స్ .. ప్రాంగ‌ణం సంద‌డి సంద‌డిగా ఉంది. మంచుతో చ‌లిగా చ‌లిగా ఉంది. మ‌ధ్యాహ్నాం వాతావ‌ర‌ణం రూటు మారింది. వెడిసెగ‌లు చ‌లిని తరిమేశాయి. మ‌ధ్యాహ్నం 1.00 గంటకు బాణాసంచా త‌యారీ కార్మికులు 38 మంది లంచ్ కు దిగారు. ఓ అర‌గంట జోకులతో భోజ‌నం కానిచ్చారు. స‌మ‌యం 2.00 కావొస్తోంది. త‌మ‌కు కేటాయించిన షెడ్ల‌కు వెళ్లిపోయారు. ప‌ని మొద‌లెట్టారు. అక‌స్మాత్తుగా చెవులు ప‌గిలే శ‌బ్ధం… అగ్నికీల‌లు ఆక్ర‌మించ‌గా.. కూలీల గావు కేక గాలిలో క‌లిసిసోయింది.

100 మీట‌ర్ల దైరంలోని ప‌చ్చ‌ని పొలాల్లో శ‌వాలు ఎగిరి ప‌డ్డాయి. 18 మంది తునాతున‌క‌లుగా క‌నిపించారు. 5 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కూ పేలుడు శ‌బ్ధం వినిపించింది. ఆకాశంలో న‌ల్ల‌ని పొగ విస్త‌రించింది. ఈ ఘోర‌ఖ‌లి స‌మాచారంతో.. అగ్నిమాప‌క ద‌ళాలు ఉరుకులు ప‌రుగుల‌తో వేట్ల‌పాలెంలో ఊరి చివ‌ర సూర్య‌శ్రీ ఫైర్స్ కంపెనీకి చేరుకున్నాయి. పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్నారు. 8 మంది క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ విస్పోనంతో వేట్ల‌పాలెంలోని ఓ ప్రైవేటు పాఠ‌శాల భ‌వ‌నం శ్లాబు బీట‌లు వారింది.

deadly explosion : చ‌లించిన ప్ర‌భుత్వం

deadly explosion

ఈ దుర్ఘ‌ట‌న స‌మాచారంతో.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, హోంమంత్రి అనిత‌, వ్య‌వ‌పాయ‌శాఖ మంత్రి అచ్చెంనాయుడు, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌, బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి, కందుల దుర్గేష్ తీవ్రంగా స్పందించారు. బాధితుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌క‌టించారు. 8 మంది క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం సాయం కోసం అధికారుల‌ను ఆదేశించారు. ఇక ఈ దుర్ఘ‌ట‌న‌ల‌కు అస‌లు కార‌ణాల అన్వేష‌ణ ప్రారంభ‌మైంది. లోతుగా అస‌లు కార‌ణాలు తెలుసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు, హోంమంత్రి అనిత ఆదేశించారు.

deadly explosion : లైసెన్సు ఉంది… నిబంధ‌న‌లే గాలికి..

deadly explosion

బాణాసంచా త‌యారీకి 2027 వ‌ర‌కూ అనుమ‌తి ఉంది. కానీ నిబంధనల ప్రకారం, ప్రతి షెడ్డులో గరిష్టంగా ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులు మాత్రమే ఉండాలి. మొత్తం యూనిట్‌లో పని చేసే వారి సంఖ్యపై కూడా పరిమితి ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో యూనిట్‌లో సుమారు 30 నుండి 40 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడి పని చేయడం వల్ల ప్రాణనష్టం తీవ్రత పెరిగింది. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా అధికారులు గుర్తించారు. ఈ యూనిట్‌కు నిర్ణీత పరిమాణంలో మాత్రమే పేలుడు రసాయనాలను (Potassium Nitrate, Sulphur, Aluminum Powder) నిల్వ చేసే అనుమతి ఉంది.

deadly explosion

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో రసాయనాలను ఎండబెట్టడం లేదా మిశ్రమం తయారు చేయడంలో అజాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. అనుమతించిన దానికంటే రెండింతలు ఎక్కువ నిల్వలు ఉండటం వల్లే ఒక షెడ్డులో మొదలైన మంటలు వరుసగా అన్ని షెడ్లకు వ్యాపించి (Chain Reaction) భారీ విస్ఫోటనానికి దారితీశాయి. షెడ్ల మధ్య ఉండాల్సిన సురక్షిత దూరం పాటించలేదు. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు అవసరమైన నీటి ట్యాంకులు లేదా రసాయన చల్లార్చే పరికరాలు (Fire Extinguishers) అందుబాటులో లేవని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.

deadly explosion : పోలీసుల అదుపులో య‌జ‌మాని

deadly explosion

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ యజమాని అడపా నాని (అడపా సూర్యనారాయణ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామర్లకోట పోలీసులు య‌జ‌మాని పై సెక్షన్ 304 (PART-II) IPC (నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించడం – హత్యానేరం కానటువంటిది) Explosives Act (పేలుడు పదార్థాల చట్టం) కింద కేసు నమోదు చేశారు. య‌జ‌మానితో పాటు మేనేజర్ , సూపర్‌వైజర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

deadly explosion : ప్ర‌భుత్వం స్పంద‌న

deadly explosion

మృతుల కుటుంబాలకు: ఒక్కొక్కరికి ₹10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్ర‌భేత్వం ప్ర‌క‌టించింది. ఈ మొత్తాన్ని నేరుగా బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకున్నారు. AP Government Portal ద్వారా ఈ నిధుల విడుదల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి ₹5 లక్షలు, స్వల్ప గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రులకు ₹2 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాల‌కు ₹ 2 లక్షల ప‌రిహారం, క్ష‌త‌గాత్రుల‌కు ₹ 50,000 ఆర్థిక సాయం అందిస్తారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం మరియు అర్హతను బట్టి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం హామీ ఇచ్చింది.

deadly explosion 12 ఏళ్ల కింద‌ట.. ఇదే దుర్ఘ‌ట‌న

deadly explosion

దీపావ‌ళికి రెండు రోజుల ముందు 2014, అక్టోబర్ 20, సోమవారం మధ్యాహ్నం సుమారు 2:45 గంటలకు. ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ యూనిట్‌లో కార్మికులు బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మొదటి షెడ్డులో నిప్పురవ్వలు సెకన్ల వ్యవధిలో మిగిలిన 15 షెడ్లకు వ్యాపించాయి (Chain Reaction). పేలుడు ధాటికి భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పేలుడు తీవ్రతకు మృతదేహాలు 100 మీటర్ల దూరంలోని పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది మరణించారు.

deadly explosion

వీరిలో అత్యధికులు (సుమారు 14 మంది) మహిళా కార్మికులే.10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కాకినాడ GGH ఆసుపత్రికి తరలించారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు.మృతులంద‌రూ వేట్లపాలెం, జి.మేడపాడు, వత్సవాయి గ్రామాలకు చెందిన నిరుపేద వ్యవసాయ కూలీలు. దీపావళి పండుగ ఖర్చుల కోసం అదనపు ఆదాయం వస్తుందని ఈ పనులకు వచ్చారు.

deadly explosion : ప్రమాదానికి ప్రధాన కారణాలు

అనుమతించిన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారు. రసాయనాల మిశ్రమం తయారు చేసే సమయంలో ఘర్షణ (Friction) వల్ల నిప్పురవ్వలు ర‌గిలాయి. షెడ్ల మధ్య కనీస దూరం లేదు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. (తర్వాతి కాలంలో మ‌రింత సాయం పెంచారు).కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹2 లక్షల చొప్పున సహాయం ప్రకటించింది.

deadly explosion: సూర్యశ్రీ య‌జ‌మాని అరెస్టు

deadly explosion

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ యజమాని అడపా సూర్యనారాయణ (నాని) పై క్రిమినల్ కేసులు నమోదు చేసి జిల్లా అధికార యంత్రాంగం అరెస్ట్ చేసింది. ఈ ఘటన తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలపై కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రతి ఏటా దీపావళికి ముందు ‘సేఫ్టీ ఆడిట్’ తప్పనిసరి చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ పూర్తి చేసి కాకినాడ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

న్యాయ విచారణలో నిబంధనల ఉల్లంఘన (అనుమతించిన దానికంటే ఎక్కువ మందుగుండు నిల్వ చేయడం) రుజువైనందున, యజమానిపై జరిమానాతో పాటు శిక్షలు విధించారు. తీర్పుపై నిందితులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ కేసు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ యూనిట్ లైసెన్స్‌ను జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) శాశ్వతంగా రద్దు చేశారు.

deadly explosion : హామీల అమలు అంతంతే

deadly explosion

మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామన్న హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కొందరికి స్థానిక పంచాయతీలలో రెవెన్యూ విభాగంలో చిన్న తరహా పనులు కల్పించినట్లు నివేదికలు న్నాయి.కొందరు భూమి లేని పేదలకు అప్పటి ప్రభుత్వ పథకాల కింద ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది.

deadly explosion : మ‌ళ్లీ లెసెన్స్ ఎలా ఇచ్చారు?

deadly explosion

2914లో జ‌రిగిన ఘోర ప్ర‌మాదంలో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్టు అధికారులు నిర్థారించి లైసెన్స్‌ను శాశ్వ‌తంగా ర‌ద్దు చేశారు. అదే సూర‌శ్రీ ఫైర్ వ‌ర్క్స్ పేరుతో అధికారులు మ‌ళ్లీ లైసెన్స్ ఎలా మంజూరు చేశారు. ఫైర్ శాఖ‌,రెవెన్యూ శాఖ‌, పోలీసు శాఖ ఏ మ‌త్తులో నిద్ర‌పోయాయి. ఇప్పుడు కూడా నిందితుడిని స్థానిక కోర్టు దోషిగా నిర్ధారిస్తే.. పాత ప‌ద్ద‌తిలోనే ఉన్న‌త న్యాయ‌స్థానానికి వెళ్తారు. అప్పీల్ చేస్తారు? బెయిల్ పై వ‌చ్చి.. ది గ్రేట్ సూర్య‌శ్రీ ఫైర్ వ‌ర్క్స్ కార్ఖానా ప్రారంభిస్తారు. చ‌ట్టాన్ని ఆయ‌న త‌న చుట్టం చేసుకోగ‌ల‌డు. ప్ర‌భుత్వం చెల్లించే ప‌రిహారంతో బాధితులూ మాట్లాడారు. ఎందుకంటే పోయినోళ్లు తిరిగిరారు క‌ధా?

Leave a Reply