మున్సిపల్ అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు…

మున్సిపల్ అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు…

  • కోతుల బావి స్థలం పై కౌన్సిల్ సమావేశం రసా భాస..
  • కోతుల బావి స్థలం మున్సిపాలిటీదా,లేక ఆలయందా…? తేల్చా లంటూ చైర్మన్ పొడియం ముందు కౌన్సిలర్లు ఆందోళన..
  • సమావేశంలో ఆలయ ప్లకార్డులు పట్టుకొని నిరసనకు కూర్చున్న కౌన్సిలర్లు..
  • ఆలయం చుట్టూ పాతిన బండలను తొలగించాలని డిమాండ్..
  • బండలను తొలగించి,ఆలయ భూములను కాపాడాలని,మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఛైర్మన్ రఘు..

ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : కోతుల బావి (శీ ఆంజేనేయ స్వామి) సర్వే నం. 321 లో 33 సెంట్ల స్థలం మున్సిపాలిటీదా…? లేదా దేవాలయం దా…? తేల్చాలంటూ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. దీంతో శనివారం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కె యస్ రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన సాధారణ సమావేశం రసా భాస గా మారింది. కోతుల బావి స్థలం కు చారిత్రక ఆధారాలు ఉన్నాయని అలాంటప్పుడు ఆ స్థలాన్ని అన్యాక్రాంతంగా ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. కౌన్సిలర్ దయాసాగర్ చైర్మన్ పోడియం ముందు బైఠాయించి పరదాలు కట్టి దేవుని విగ్రహాలను తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు? స్థలం మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా విధాతధంగా ఉంచితే ఎలాంటి సమస్యలు ఉండవని సూచించారు.

అందుకు సభ్యులు మండిపడుతూ అధికారుల అత్యుత్సాహం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఆరోపించారు తక్షణమే దీనిపై సమాధానం ఇవ్వాల్సిందేనని కో ఆప్షన్ సభ్యురాలు శాంతి డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఎలాంటి మతకోలలో లేవని మతసామరస్యంతో అందరూ సోదరుభావం కలిగి జీవిస్తున్నామని ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ముక్తకంఠంతో అరిచారు. అందుకు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు మాట్లాడుతూ తక్షణమే ఆలయం చుట్టూ పాతిన బండలను తీసివేసి ఆలయ స్థలాన్ని పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి స్థలంపై ఉన్న సమస్యను తొలగించాలని సభ్యులు ఇచ్చిన వినతిపత్రానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత కమీషనర్ దే

పట్టణ పరిధిలోని మున్సిపల్ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గా తనపై ఉందని కమిషనర్ గంగిరెడ్డి స్పష్టం చేశారు. సభ్యులు గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా సర్వేనెంబర్ 321 లో 33 సెంట్లు స్థలం లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు అని అడిగిన ప్రశ్నకు చేపట్టలేదని సమాధానం ఇచ్చిన తప్ప 33 సెంట్లు స్థలం ఆలయం లేనని తాము ఇవ్వలేదన్నారు. అయినా స్థలం సర్వే చేసి దాని హద్దులు నిర్ణయించాల్సింది రెవెన్యూ యంత్రాంగమేనని ఆయన చెప్పుకొచ్చారు.

Leave a Reply