ఇసుక తోడేళ్లపై పోలీస్ ఫైర్

ఇసుక తోడేళ్లపై పోలీస్ ఫైర్

  • గ్రామాల్లో తనిఖీలు.. డంప్ లపై దాడులు
  • రహదారులపై కందకాలు తవ్వించి అడ్డగింపు
  • ఆక్రమణదారుల్లో వణుకు
  • కఠిన చర్యలు తప్పవని స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి.వేణు హెచ్చరిక

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం కొత్తపల్లి, తాటికొండ గ్రామాల్లో కొంత కాలం గా రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణాతో కలవర పడుతున్నాయి. గ్రామాల పరిసర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వకం చేసి ట్రాక్టర్ల ద్వారా రహస్యంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందాయి. పర్యావరణానికి ముప్పు, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిసి పరిస్థితిని తీవ్రతరం చేశా యి. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌ పూర్ సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

గత కొన్ని రోజులుగా గోప్యంగా సమాచారం సేకరించిన పోలీసులు, సరైన సమయం చూసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల పరిసర ప్రాంతాల్లో సాగుతున్న అక్రమ ఇసుక దందా ను ముట్టడి చేసి, ఇసుక తరలింపులకు ఉపయోగిస్తున్న మార్గాలను పర్యవేక్షించారు. తనిఖీల్లో భాగంగా గ్రామాల వెలుపల అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపులను గుర్తించారు. వెంటనే జేసీబీల సాయంతో ఆ డంపు లను పూర్తిగా తొలగించారు. అక్రమ రవాణాకు ప్రధాన మార్గాలుగా ఉపయోగిస్తున్న గ్రామీణ రహదారులపై కంధకాలు తవ్వించి ట్రాక్టర్ల రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. దీంతో అక్రమ ఇసుక తరలిం పుకు తాత్కాలికంగా గట్టి బ్రేక్ పడింది.

ఇసుక రవాణా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం:
స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి. వేణు

ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగే ఇసుక తవ్వకాలను ఎట్టి పరిస్థి తుల్లోనూ సహించం..రవాణా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసు కుంటాం..వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. గ్రామాల్లో ఎవరైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అక్రమాలకు పాల్ప డేవారిని ఏమాత్రం ఉపేక్షించ మని గట్టిగా హెచ్చరించారు. ముందు ముందు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. ప్రజలు కూడా సమా చారం అందించి సహకరించాలి.అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Leave a Reply