ways2solutions | PCOS కారణాలు, లక్షణాలు, డైట్, జాగ్రత్తలు, సైడ్ ఎఫెక్ట్స్

ways2solutions | పీసీఓఎస్ కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు & ఆరోగ్య సూచనలు

ways2solutions | పీసీఓఎస్ ఎందుకు వస్తుంది?
పీసీఓఎస్ లక్షణాలు ఎలా గుర్తించాలి?
పీసీఓఎస్ నిర్ధారణకు అవసరమైన పరీక్షలు
ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? జీవనశైలి మార్పుల ప్రాముఖ్యత
పీసీఓఎస్ ఉన్న అమ్మాయిలకు సరైన డైట్ ప్లాన్
పాటించాల్సిన రోజువారీ ఆరోగ్య జాగ్రత్తలు
పీసీఓఎస్ వల్ల కలిగే దీర్ఘకాల సైడ్ ఎఫెక్ట్స్

ways2solutions | ప్రస్తుతం యువతుల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి పీసీఓఎస్ ఆధునిక జీవన శైలితో వచ్చిన మార్పులు, మారుతున్న, మారిన ఆహారపు అలవాట్లు, చదువు, ఉద్యోగాలు, వ్యక్తిగత సమస్యల వల్ల కలిగే మానసిక ఒత్తిడి లాంటి కారణాల వల్ల ఈ శరీరక సమస్య పెరుగుతోంది. అమ్మాయిల్లో, లేదా వారి తల్లుల్లో ఈ సమస్య పట్ల సరైన అవగాహన కలిగి ఉంటే కొన్ని చిట్కాల ద్వారా దీనిని నియంత్రించుకోవచ్చు.

అసలు అమ్మాయిల్లో పీసీఓఎస్ సమస్య ఎందుకు వస్తుంది.. అంటే పీసీఓఎస్ అనేది ప్రధానంగా హార్మోన్లలో అసమతుల్యత వల్ల వస్తుంది. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక ఆండ్రోజెన్ (పురుష హార్మోన్) ఉత్పత్తి వల్ల అండాశయాల్లో చిన్న చిన్న సిస్టులు ఏర్పడతాయి. అందుకు ప్రధాన కారణాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక బరువు.

ఇవేకాక జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి అవేమిటంటే, అధిక ఒత్తిడి, తరచుగా తినే ఫాస్ట్ ఫుడ్, బయట్ దొరికే జంక్ ఫుడ్ త్రచుగా, అధికంగా తినడం లాంటివి. అంతేకాక, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం.

మరి ఈ సమస్యను గుర్తించడమెలా అంటే పీసీఓఎస్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిచవచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడం, శరీర బరువు పెరగడం.
ముఖంపై, ఛాతీపై రోమాలు పెరిగి ముఖం రఫ్ గా తయారవడం. ముఖం పై మొటిమలు, తల దువ్వినప్పుడల్లా జుట్టు రాలిపోతూండడం. గర్భధారణలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురు కావడం…

పీసీఓఎస్ ని నిర్ధారించుకోవడం ఎలా సాధ్యమవుతుందంటే, హార్మోన్ టెస్టులు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కాన్, ఇంకా రక్త పరీక్షలు, చేయించుకోవాలి.

డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

ways2solutions
ways2solutions

పీసీఓఎస్ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అంటే, ఇది పూర్తిగా తొలగి పోయే సమస్య కాదు. కానీ సరైన, ఆరోగ్యకరమైన ఆహారపు, జీవనశైలి మార్పులతో చాలావరకు నియంత్రించవచ్చు.
అందులో ముఖ్యంగా రెగ్యులర్ గా తగిన వ్యాయామం ద్వారా బరువు తగ్గడం ఇది కనీసం ఐదు నుంచి పది శాతం తగ్గినా మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇక ముఖ్యంగా మానసిక ఒత్తిడిని బాగా తగ్గించుకోవడం. అందుకు మంచి మంద్రమైన సంగీతం వింటూ నిద్రలోకి జారుకోవడం, నిద్రకు ముందు మొబైల్ చూడడం తగ్గించుకోవడం, యోగా, మ్యూజిక్ థెరపీ లాంటివి కూడా మార్పునిస్తాయి.
ఇవేకాక డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం. ఇక పీసీఓఎస్ ఉన్న అమ్మాయిలు పాటించాల్సిన డైట్ ఇదే. ఎందుకంటే అన్నిటికన్న తినే ఆహారం, తిండి వేళలు చాలా కీలకంగా పనిచేస్తాయి..

మిల్లెట్స్ (జొన్న, రాగి, సజ్జ) బ్రౌన్ రైస్, ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, బాదం, వాల్‌నట్స్, పెరుగు, ఇక తగ్గించాల్సినవి లేదా పూర్తిగా మానేయాల్సినవి, మైదా పదార్థాలు, వైట్ బ్రెడ్, స్వీట్స్, సోడాలు, కూల్ డ్రింకులు. ఫాస్ట్ ఫుడ్.

రోజుకు కనీసం 2–3 లీటర్లు నీళ్ళు తాగాలి.
రోజుకు 30–45 నిమిషాలు నడక లేదా యోగాకి సమయం కేటాయించాలి. రాత్రుళ్ళు త్వరగా నిద్రకు ఉపక్రమించి, కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ways2solutions
ways2solutions

మొబైల్/స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి నియంత్రణలో ఉంచుకోవాలి.
రెగ్యులర్ గా మెడికల్ చెకప్ లు చేయించుకోవాలి.
పీసీఓఎస్ సమస్య వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పీసీఓఎస్‌ను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది..ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

గర్భధారణకు ఇబ్బందులు, సమస్యలు, గర్భం ధరించినప్పుడు కూడా కొన్ని సమస్యలు, నిరంతర వైద్యుల పర్యవేక్షణ అవసరం కావచ్చు.
డిప్రెషన్ పెరిగే ప్రమాదముంటుంది. థైరాయిడ్ సమస్యలు తీవ్రం కావచ్చు.

పీసీఓఎస్ ఒక సాధారణ కానీ నిర్లక్ష్యం చేయకూడని సమస్య. సరైన డైట్, వ్యాయామం, మానసిక ప్రశాంతతతో దీన్ని నియంత్రించవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు — అవగాహనతో ముందడుగు వేయాలి.

click here to read 6amWalk | నడకే దివ్యౌషధం. రోజుకు ఎవరు, ఎంత, ఎప్పుడు నడవాలి?

click here to read more

Leave a Reply