హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఇస్తుండగా బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్‌కు ముందు ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ స్ట్రెచర్ మీది నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 ఏండ్లు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాదక్షుడు అయిన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే.. తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము సీఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు.
TG Assembly | రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరించిన బిఆర్ఎస్
