AP | ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడు – పవన్ కు “చిరు” ప్రశంస

హైదరాబాద్: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసైనికులు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ మీటింగ్‌లో పార్టీ వ్యవస్థాపకుడు, ఎపి ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు.

ఈ స్పీచ్ పవన్‌ స్పీచ్ ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవికి విపరీతంగా నచ్చిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘మై డియర్ బ్రదర్ పవన్‌కళ్యాణ్, జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు!’ అంటూ చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *