Kiran Abbavaram | అంత పెంచేసాడా..?

Kiran Abbavaram | అంత పెంచేసాడా..?
Kiran Abbavaram | వరుస సక్సెస్లతో కిరణ్ అబ్బవరం హవా
కథ నుంచి మార్కెటింగ్ వరకు పూర్తి ప్లానింగ్
కిరణ్తో సినిమా అంటే నిర్మాతలకు సేఫ్ బెట్?
రెమ్యూనరేషన్ భారీ పెంపు నిజమేనా?
10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడా?
డిమాండ్ ఉందని పెంపు సరైనదేనా?
నెక్ట్స్ సినిమాల ఫలితాలపై భవిష్యత్ ఆధారమా?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కిరణ్ అబ్బవరం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా సక్సెస్ సాధిస్తూ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈమధ్య కాలంలో క, కె ర్యాంప్ అనే డిఫరెంట్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే.. ఈ యంగ్ హీరో రెమ్యూనరేషన్ బాగా పెంచేశాడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. కిరణ్ అబ్బవరం రెమ్యూనరేషన్ నిజంగానే పెంచాడా..? అతను డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ ఎంత…?
Kiran Abbavaram | కిరణ్ తో సినిమా చేస్తే..

కిరణ్ అబ్బవరం హీరో అయినప్పటికీ.. కథ పైనా.. ప్రొడక్షన్ పైన మంచి పట్టు సాధించాడు. తను చేస్తున్న సినిమాల విషయంలో అన్నీ తానై చూసుకుంటాడు. ఎలాంటి కథతో సినిమా చేయాలి..? ఆ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? అనేది పక్కా ప్లానింగ్ తో వర్క్ చేస్తుంటాడు. అందుకనే అతని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇటీవల కిరణ్ నుంచి వచ్చిన క, కే ర్యాంప్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో కిరణ్ తో సినిమా చేస్తే.. సేఫ్ అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగించాడు.
Kiran Abbavaram | 10 నుంచి 12 కోట్లా..?

ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తుండడం.. నిర్మాతలకు లాభాలు తీసుకువస్తుండడంతో.. కిరణ్ అబ్బవరం రెమ్యూనరేషన్ భారీగా పెంచేసాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎంతంటే.. దాదాపు 10 నుంచి 12 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని ఇటీవల ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నాడని.. ఈ ప్రాజెక్ట్ కి ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. కిరణ్ అబ్బవరం రెమ్యూనరేషన్ పెంచడం పై కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది డిమాండ్ ఉంది కాబట్టి పెంచడంలో తప్పులేదు అంటుంటే.. నిర్మాతలకు అందుబాటులో ఉండే ఈ యంగ్ హీరో కూడా రెమ్యూనరేషన్ పెంచేస్తే ఎలా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఏది ఏదైనా ఇండస్ట్రీలో సక్సెస్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే.. కిరణ్ మరింత పెంచేస్తాడేమో..

