చెరువును కాపాడాలని వినతిపత్రం అందజేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలోని నల్లకుంట చెరువును కాపాడాలని సోమవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో దండేపల్లి తహసిల్దార్ రోహిత్ దేశ్పాండే కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు చెరువులో మొరంపొస్తూ చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాదారుల నుండి చెరువును కాపాడి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు మేంగు లింగన్న, మత్స్య కార్మికులు మెడవేణి సత్యనారాయణ, గరిగే మురళి, లచ్చన్న, రాధాకృష్ణ, నక్క ఆశాలు ,నారాయణ, కల్లూరి భీమన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply