అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • రంపచోడవరం డీఎఫ్వో శివ కుమార్ గంగల్
  • పులి సంచారం పై వివరాలు వెల్లడి
  • రాత్రి సమయంలో ఆరుబయట పడుకోవద్దు

రంపచోడవరం రూరల్ (పోలవరం జిల్లా) ఆంధ్రప్రభ : రంపచోడవరం పరిసర అడవి ప్రాంతాలలోని పెద్దపులి సంచారం పై ఎక్కడికి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని రంపచోడవరం డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివ కుమార్ గంగల్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డివిజనల్ ఫారెస్ట్ అధికారి వారి ఛాంబర్ లో పులి సంచారం పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పాత్రికేయుల సమావేశం డివిజనల్ ఫారెస్ట్ అధికారి నిర్వహించారు.

ఈ సందర్భంగా రంపచోడవరం డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ మాట్లాడుతూ పాపికొండల నేషనల్ పార్కులో మగ పెద్దపులి వదలడం జరిగిందని ఆయన తెలిపారు. నల్లమల అడవులలో మగ పులులు ఎక్కువగా ఉండటం వలన కొట్లాడుకునే అవకాశం ఉన్నందున మగ పులిని నేషనల్ పార్క్ లో వదలడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ఒంటరిగా ఎవరు బయట తిరగవద్దని అదేవిధంగా చిన్నపిల్లలను రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపవద్దని ఆయన అన్నారు.

ఎక్కడైనా ఆవులు మేకలు పులి బారిన పడిన యెడల ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ పులికి జియో టాకింగ్ సిస్టం అమర్చడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు పులి బారిన పడకుండా 24×7 ఎప్పటికప్పుడు పరివేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

నేషనల్ పార్కు పూర్తిస్థాయిలో ఏర్పాటు అయిన తర్వాత ఈ ప్రాంత గిరిజన యువతి యువకులకు టూరిజం అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకువచ్చని ఆయన తెలిపారు. ఈ పులి సంచారం తగ్గేవరకు వివిధ గ్రామాలలోని ప్రజల అప్రమత్తంగా ఉండే విధంగా ఫారెస్ట్ సిబ్బందితో ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

Leave a Reply