డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు రిలే నిరాహార దీక్ష చేపడతాం

డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు రిలే నిరాహార దీక్ష చేపడతాం

ఉట్నూర్, ఆంధ్రప్రభ వెనుకబడిన ఆదివాసి కోలం గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం జన్మన్ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరు ఐదు నెలలు గడుస్తున్న అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని విషయంలో తగు చర్యలు తీసుకోవాలని పలుమార్లు నిరసనలు తెలిపిన ప్రభుత్వం గానీ ప్రజాప్రతినిధులు హామీలే తప్ప తమ డిమాండ్ పరిష్కరించడంలో విఫలమవుతున్నారని కాలయాపనకు నిరసనగా ఆదివాసి కొలం సంగం ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినట్టు ఆదివాసి కొలం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సొనే రావు అన్నారు.

ఈ రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు కలిసి విన్నబించిన తమ డిమాండ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగా ఉందని దీంతో రిలే నిరాహార దీక్షలకు తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షలో ఆ సంఘం నాయకులు, కొలం గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply