Oppo నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో త్వరలో భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన లాంఛ్ డేట్ , కొన్ని ఫీచర్లు అధికారికంగా రివీల్ చేసింది కంపెనీ. ఒప్పో ఎఫ్29 5జీ, ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ మోడళ్లను మార్చి 20న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఫోన్ డిజైన్ స్లిమ్ గా 7.55 ఎంఎంతో ఉంటాయని, బ‌రువు 180 గ్రాములు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ప్రో వేరియంట్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది. 80W సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

ఒప్పో ఎఫ్29 5జీ గ్లేసియర్ బ్లూ, సాలిడ్ పర్పుల్ రంగుల్లో రానుంది. ఒప్పో ఎఫ్29 5జీ ప్రో గ్రానైట్ బ్లాక్, మార్బుల్ వైట్ షేడ్స్ లో వస్తుంది.

అండర్ వాటర్ ఫోటోగ్రఫీ సపోర్ట్ తో ఈ ఫోన్లు రానున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఈ-స్టోర్ లో ఈ ఫోన్ ల‌ని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్లు 360 డిగ్రీల ఆర్మర్ బాడీ, మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H-2022 సర్టిఫికేషన్ తో రానున్నట్లు తెలిపింది. ఐపీ 66, ఐపీ68 , ఐపీ 69 రేటింగ్స్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉండనుంది.

స్పాంజ్ బయోనిక్ కూషనింగ్, లెన్స్ ప్రొటెక్షన్ రింగ్, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో ఇంటర్నల్ ఫ్రేమ్ ఉంటుందని కంపెనీ వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *