రోడ్లపై మిరప పచ్చళ్ళు.. అనార్యోగంతో కాలనీ వాసులు

రోడ్లపై మిరప పచ్చళ్ళు.. అనార్యోగంతో కాలనీ వాసులు

పరకాల, ఆంధ్రప్రభ: పట్టణంలో రోడ్లపై మిరప పండ్ల పచ్చడి వ్యాపారాలతో పాదచారుల రాకపోకలకు ఇబ్బందుల తోపాటు, కాలనీవాసులు మిరప పండ్ల పచ్చడి ఘాటుతో శ్వాసకోశ వ్యాధులతోపాటు కండ్ల అనారోగ్య సమస్యలు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కమ్యూనిస్టు ఆఫీసు దారిలో ఇటీవల కాలంలో కొత్తగా మిరప పండ్ల పచ్చడి వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. పరకాల మండల పరిసర గ్రామాల ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం పరకాలకు వస్తూ ఉంటారు.


ముఖ్యంగా కూరగాయల మార్కెట్ ప్రాంతానికి వెళ్లి వస్తువులు కొనుగోలు అనంతరం మార్కెట్ నుండి కమ్యూనిస్టు ఆఫీసు దారి మీదుగా పోస్ట్ ఆఫీస్ నుండి బస్టాండ్ కు చేరుకుంటారు. కమ్యూనిస్టు ఆఫీసు దారిలో నిత్యం ప్రజల పాదచారులతో రద్దీగా ఉండడం జరుగుతుంది. రద్దీగా ఉండే కమ్యూనిస్టు ఆఫీసు దారిలో రోడ్ల పైన మిరప పండ్ల వ్యాపారాలతో రోడ్లమీద కూర్చొని పచ్చడి సామాగ్రిని శుభ్రపరుస్తూ ఉండడం వలన పాదచారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడడం జరుగుతుంది.


అదేవిధంగా కాలనీలోని పలువురు మిరప పండ్ల పచ్చడి ఘాటుతో శ్వాసకోశ వ్యాధులతో పాటు, కండ్ల సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప పండ్ల పచ్చడి వ్యాపారాలు వారి యొక్క షాపులలోపట వ్యాపారాలు నిర్వహించుకోకుండా రోడ్లపై కూర్చొని ఇతరులకు ఇబ్బందికరంగా మారడం సరికాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, మిరప ఘాటుతో కాలనీవాసులు అనారోగ్యాల పాలు కాకుండా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply