నూతన మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు నూతన కౌన్సిలర్లను సతీసమేతంగా,మున్సిపల్ కమిషనర్ లను శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు శ్రీ కారంపూడి నర్సింహాచార్యులు చే ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం లడ్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న , వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న,మున్సిపల్ కమిషనర్ సతీశ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు డా లక్ష్మి నర్సింహారెడ్డి,కౌన్సిలర్లు కూర్మిళ్ల ప్రమీల, సుల్తాన్ మనోజ్ కుమార్, కొండ శోభ , మొగుళ్ళ అనురాధ, గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య, నల్ల మధు,కారుపోతుల వెంకన్న,మెంట రమణ, అలయ కమిటీ ప్రతినిధులు ముప్ప వెంకట్ రెడ్డి, ఆమనగంటి వెంకట్ రెడ్డి,సోలిపురం చంద్రారెడ్డి, లింగాల జైపాల్ రెడ్డి, సోమ వెంకన్న, చోల్లేటి నరేశ్,మర్రి జయశ్రీ,బుక్క చంద్రశేఖర్, మడిపెళ్లి రంగయ్య ,దామెర సోమయ్య,శ్రీధర్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply