Rajgopal reddy | సమయపాలన ఖచ్చితంగా అమలు చేయాలి..

Rajgopal reddy | సమయపాలన ఖచ్చితంగా అమలు చేయాలి..
Rajgopal reddy, మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడులో వైన్ షాపుల సమయపాలనను ఖచ్చితంగా అమలు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్‌లో ఉన్న వైన్ షాప్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటలలోపు పర్మిట్ రూమ్‌లలో గానీ, షాపుల పరిసరాల్లో గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించరాదని నిర్వాహకులకు గట్టిగా హెచ్చరించారు. సమయపాలన విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వైన్ షాపుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియమావళి ఉల్లంఘనలు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
