Awareness | పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి..

Awareness | పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి..
Awareness | కొడిమ్యాల మండలం, ఆంధ్రప్రభః రోజున కొడిమ్యాల మండలం హిమ్మత్ రావ్ పేట గ్రామంలో డా, మర్రి మహేష్ రెడ్డి ఆద్వర్యంలో పారాక్వాట్ గడ్డి మందు పై అవగాహన, ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. డా, మర్రి మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ పారాక్వాట్ గడ్డి మందు విరుగుడు లేని విషం అని ఈ ప్యారాక్విట్ గడ్డి మందుతో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనారు. ప్రజలు చాలా సందర్భాలలో క్షిణికావేషంలో మందు తాగుతున్నారు కాని ఈ పారాక్వాట్ గడ్డి మందు తాగినచో బ్రతికే అవకాశాలు శూన్యం. ఈ పారాక్వాట్ గడ్డి మందు ప్రత్యామ్నాయ పద్దతుల గురించి వివరించారు. ఈ గడ్డి మందు ఎవరి ఇంట్లో పెట్టుకో కూడదని అవసరమైన మోతాదులో తెచ్చుకొని తగు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు.
ఈ పారాక్వాట్ గడ్డి మందును నిషేదించే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పారు. తదుపరి గ్రామ పెద్దలు పునుగోటి కృష్ణరావు మాట్లాడుతూ మా హిమ్మత్ రావ్ పేట్ గ్రామంలో లో ఇలాంటి గడ్డి మందు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మల్యాల అనసూర్య, నాయకులు ఐలయ్య, రాజేందర్, గరిగంటి మల్లేశం,తిరుపతి, గంగరాజాం, పెద్ది రమేశ్, ఆరోగ్య శిబ్బంది పాల్గొన్నారు.
