Before 2014 | జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి

Before 2014 | జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి
జాతిపిత ఒక్కరే ..ఆయనే మహాత్మా గాంధీ!
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు..?
కల్వకుంట్ల కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడింది.
వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు.
అనేక అవకతవకలు, కుంభకోణాల్లో ఇరుక్కున్నారు
2014 ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎన్ని..? ఇప్పుడు ఎన్ని..? ప్రజల ముందుంచాలి
కూలిపోయే కాలేశ్వరం కట్టడమే కాకుండా తెలంగాణను దివాలా తీశారు
అవినీతి రహిత, అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Before 2014 | స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో కడియం తీవ్ర స్థాయిలో కేసిఆర్, బిఆర్ ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ నీ అయ్యా సొత్తా..? నీ అయ్యా జాగీరా..? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ను తెలంగాణ జాతిపిత అని స్వయంగా బిఆర్ ఎస్ నాయకులు చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. తెలంగాణకు ఎం చేశాడని జాతిపిత అంటున్నారని ప్రశ్నించారు. దేశానికైనా, రాష్ట్రానికైనా ఉన్నది జాతిపిత ఒక్కరే ఉన్నారు…ఆయనే మహాత్మా గాంధీ..కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని ఎంతో మంది ప్రజలు, విద్యార్థులు, యువకులు, మేధావుల ఉద్యమ ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యంగా పని చేస్తున్నాను. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సి లర్లు అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలి. ప్రజల నుండి రూపాయి ఆశించకుండా పని చేయాలి. అవినీతి రహితంగా వ్యవహరించాలి. మన నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్బం గా స్టేషన్ ఘన్ పూర్ మండలానికి సంబందించిన 28మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 28లక్షల 03వేల 248 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు.
బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు
ప్రజలు వాళ్ల మాటలను పట్టించుకోవడం లేదనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం..కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలకు ప్రజలు బిఆర్ఎస్ కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు.. మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రాలేదని ఎమ్మె ల్యే కడియం శ్రీహరి ఏద్దేవా చేశారు. బిఆర్ఎస్ నాయకులు అధి కారం వాళ్ళ జన్మ హక్కుగా, కల్వకుంట్ల కుటుంబ హక్కుగా వ్యవహరిస్తున్నా రని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా విపరీతమైన ధోరణి తో నీచమైన విమర్శలు చేస్తున్నారు. సభ్యత సంస్కారం లేకుండా స్థాయిని మరిచి విమర్శలు చేయడం మంచిది కాదని అందుకే ప్రజలు ఓటు రూపంలో తిప్పికొట్టారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి, అక్ర మాలకు పాల్పడింది. వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. అనేక అవకతవకలు, కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. 2014కు ముందు వారి ఆస్తులు ఎన్ని..? ఇప్పుడు ఎన్ని..?ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడి ఇన్ని ఆస్తులు మీరు కష్టపడి చెమటోడ్చి సంపాదించారని ప్రశ్నించారు. కల్వ కుంట్ల కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ కేసులలో ఇరుక్కున్నారని వాళ్ళు కేసులలో ఇరుక్కుంటే తెలంగాణనే అవమానిస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటి మెంట్ ను వాడుకొని రాజకీయాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు:
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో నియోజకవర్గంలో 50శాతానికి పైగా ఓట్లు సాధించి, 70 శాతానికి పైగా స్థానాలలో విజయం సాధించామని తెలిపారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీపైన, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన నమ్మకం ఏంటో ఈ గెలుపుతో రుజువు అయిందని తెలిపారు. ప్రజలు అందించిన ఈ గెలు పుతో మా బాధ్యత పెరిగిందని అన్నారు. అవినీతి రహిత, పారదర్శక అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వచ్చే రెండు ఏళ్లలో గణనీ యమైన అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బెలిదే వెంకన్న, బూర్ల శంకర్, రాపోలు మధు సూదన్ రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, గట్టు రమేష్, సర్పంచ్ లు మంతెన రాణి అనిల్, పురుమాని కోమల అయిలోని, మంతెన హరిత ఇంద్రసేనా రెడ్డి, కౌన్సిలర్లు పొన్న రవి, హరినాథ్, బొల్లు లక్ష్మి, తహ సీల్దార్ వెంకటేశ్వర్లు, ఇతర ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్య కర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

