Karnataka | పాపం వృద్ధ దంప‌తులు…

Karnataka | పాపం వృద్ధ దంప‌తులు…

Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పెద్దమనసుతో అప్పు ఇవ్వడం… అది ఆమె ప్రాణానికే ముప్పు అనే విషయం గుర్తించలేకపోయింది. అప్పుగా తీసుకున్నరూ.8లక్షలు చెల్లించలేక అప్పు ఇచ్చిన వృద్దురాలినే చంపేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

భర్త కళ్లెదుటే మహిళ దారుణ హత్యకు గురైంది. కోటె బీడి ప్రాంతం, నీలమంగళలో రంగనాథ్, శోభ (70) అనే వృద్ధ దంపతులు ఒంటరిగా జీవిస్తున్నారు. భర్త రంగనాథ్ కొన్నేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. అయితే, శోభ వద్ద డబ్బు, బంగారు నగలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నగలపై కన్నేసిన శివకుమార్ అనే వ్యక్తి వారి ఇంట్లోకి చొరబడి నగలు కోసం శోభను గొంతుకోసి చంపాడు.

అది కూడా భర్త కళ్లముందే హత్య చేశాడు. అప్పు ఎగ్గొట్టేందుకు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Leave a Reply