Admissions | గురుకుల విద్యాలయాల్లో…

Admissions | గురుకుల విద్యాలయాల్లో…

  • 5వ తరగతికి నూతన అడ్మిషన్లు…
  • 6, 7, 8 తరగతుల్లో ఖాళీల భర్తీకి..
  • ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులలో నూతన అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్..

Admissions | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ​ఏపీ లోని గురుకుల విద్యాలయాల సంస్థ ఏ పి ఆర్ ఈ ఐ ఎస్ లో రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి లో నూతన అడ్మిషన్ల కోసం 6, 7, 8 తరగతుల్లో ఖాళీలు, ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ పాఠశాల కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. ​దరఖాస్తుల ప్రక్రియ మార్చి 31వ తేదీ లోపల ముగుస్తుందన్నా రు. ప్రతి విద్యార్థి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 24 వ తేది న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ​

పరీక్షకు వారం రోజుల ముందు నుండి పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఐదవ ​ తరగతి లోను, ఇంటర్మీడియట్ కోర్సులు అడ్మిషన్ పొందాలంటే ఈ అర్హతలు ఉండాలని సూచించారు. ​5 వ తరగతి లో ప్రవేశం పొందాలంటే ప్రస్తుతం 4వ తరగతి రెగ్యులర్ గా చదువుతున్న విద్యార్థులు అర్హులు. మిగిలిన ​6, 7, 8 తరగతులకు ఆయా తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీ ప్రస్తుతం అంతకు ముందు తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ​జూనియర్ ఇంటర్ లో అడ్మిషన్ల కోసం అర్హత గా ప్రస్తుతం 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

Admissions |

వీరు ఎంపీసీ, బైపీసీ, సీఈ సీ, మెకానిక్ ఎం ఈ సీ గ్రూపుల కు దరఖాస్తు చేసుకోవచ్చు. ​డిగ్రీ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ పొందాలంటే ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. వారు బి .ఏ, బి.కామ్, బి.ఎస్ సీ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.​ అభ్యర్థులు దరఖాస్తు చేసుకో బోయే విద్యార్థులు దరఖాస్తు రుసుము 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ​ఈ చెల్లింపు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకునే విధానం ​మొదట అధికారిక వెబ్‌సైట్ https://aprs.apcfss.in సందర్శించాలి.

తరువాత పేమెంట్ ​ లింక్ ద్వారా ఫీజు చెల్లించి జర్నల్ నెంబర్ ను పొందాలని సూచించారు. ​ఆ తర్వాత అప్లికేషన్ ఫారం ను నింపాలి. ఆ తరువాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలని సూచించారు. ​చివరగా అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.విద్యార్థి గుర్తింపు కోసం ఆధార్ కార్డు ను, ​కుల ధృవీకరణ పత్రం, రిజర్వేషన్లు పొందడానికి. ​ఆదాయ ధృవీకరణ పత్రం,లేదా తెల్ల రేషన్ కార్డ్, వార్షిక ఆదాయం పరిమితిలో ఉండాలని సూచించారు. ​

గత తరగతుల విద్యా వివరాల కోసం ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జారీ చేయబడిన స్టడీ సర్టిఫికెట్లు పొందుపరచాలి. ఆ తర్వాత విద్యార్థి, ​ఫోటో, సంతకం ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పరీక్షా పరీక్షా విధానం ఉంటుంది. సరళి ​పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఓఎంఆర్ షీట్ పద్ధతిలో జరుగుతుందన్నారు. ​అభ్యర్థులు ఎంచుకున్న తరగతి లేదా గ్రూపును బట్టి సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయన్నారు. ​ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనం, కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందన్నారు. ​బోధన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నారు. అవకాశాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రుల అప్రమత్తమై ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply