Self Punishment : ఇదొక స్వీయ శిక్ష స్వీయ శిక్ష Andhra Prabha TOP Story

Self Punishment : ఇదొక స్వీయ శిక్ష స్వీయ శిక్ష Andhra Prabha TOP Story
మదన పల్లి కిరాతకుడి కథ అంతం
చిన్నారిపై లైంగిక దాడి
ఆపై నీటిడ్రమ్ములో కుక్కి హత్య
ఉరి సరి జనం నినాదం
ఎట్టకేలకు తీరిన ప్రజల ఆకాంక్ష
( అన్నమయ్య బ్యూరో / మదనపల్లె , ఆంధ్రప్రభ )
ఏడేళ్ల చిన్నారిపై హత్యచారం ఉదంతంతో .. గత రెండు రోజులుగా అట్టడికిన మదనపల్లిలో మరో సంచలనం తెర మీదకు వచ్చింది. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై హత్య చారం చేసిన నిందితుడు కులవర్ధన్ (30 ) ఆత్మ హత్య చేసుకున్నాడు. కురభలకోట మండలం కనసానవారిపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చెరువులో అతని మృతదేహం లభ్యమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏడేళ్ల చిన్నారిని తన ఇంటికి తీసుకు వెళ్లి లైంగిక దాడి చేసి నీటి డ్రమ్ములో కుక్కి చంపిన కిరాతకుడి స్వీయ శిక్ష ( Self Punishment) కథ.. జనం ఆకాంక్షను నెరవేర్చినట్టే. అసలీ ఘోరం జరిగిన తీరు.. తక్షణ న్యాయం కోసం జనం డిమాండు.. ఆ తరువాత పరిణామాలను ఓ సారి పరిశీలిద్దాం.

ఆ చిన్నారి బాలిక 7 సంవత్సరాలు. రెండో తరగతి చదువుతోంది. ఆ తల్లిదండ్రులకు ఆ ముద్దుల కూతురే స్వర్గం. రోజంతా కష్టపడిన ఆ పేద కూలి కుటుంబానికి ఆ చిన్నారి పాప ఆనందాన్ని ఇచ్చే టానిక్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఆ పసికందు కనిపించకపోవడం.. నిద్దుర లేచిన నుంచి వెతకడం.. చివరకు ఒక డ్రమ్ములో ఆ బాలిక విగతజీ విగా కుక్కి ఉండడం… ఈ దృశ్యాన్ని చూసిన ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత హృదయ వేదారకమో.. వర్ణనాతీతం.

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి లోని నీరు గట్టుపల్లి అన్నది ఒక ప్రాంతం. అక్కడ గోపీనాథ్, స్వర్ణలత చేనేత కార్మికులు. ఈ దంపతులకు రెండో తరగతి చదివే ఏడేళ్ల వయసుగల కుమార్తె ఉంది. ఆ ఇంటికి ఎదురుగానే కులవర్ధన్ అనే 30 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. అతని నేర చరిత్ర పరిశీలిస్తే.. సమాజంలో బాధ్యత లేకుండా వ్యవహరించడంతో పాటు డ్రగ్సు, గంజాయి కి అలవాటు పడి ఇప్పటికే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానిక పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి.
ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. సోమవారం రాత్రి చిన్నారి బాలికతో ఆ యువకుడు నేరుగా మాట్లాడుతుండడాన్ని ఆ బాలిక తాత గమనించాడు. అంతే.. రాత్రి పొద్దు పోవడంతో ఎవరికి వారుగా నిద్రించారు. ఉదయం లేవగానే ఆ తల్లిదండ్రుల ముద్దుల కూతురు కనిపించలేదు. ఆ కుటుంబం తట్టుకోలేక తహతహలాడింది. తపన తపనగా వెతుకులాడింది. సమీపంలోని మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. చివరకు ఆ వెతుకులాటలో ఆ చిన్నారి తాము నివసించే ఇంటికి ఎదురుగా ఉన్న కులవర్ధన్ అనే యువకుడి ఇంట్లోని డ్రమ్ములో కుక్కిన శవంగా ప్రత్యక్షమైంది.
Self Punishment : అట్టుడికిన మదనపల్లె
కులవర్తన్ ఇంట డ్రమ్ములో దొరికిన చిన్నారి మృతదేహాన్ని చూసిన జనం చలించిపోయారు. సహించలేక పోయారు. ఈ దారణ ఘటనపై చలించిన మదనపల్లెలోని వీధి వీధిన కదిలారు. బాధిత కుటుంబం వద్దకు చేరుకున్నారు. సంఘటన సీరియస్ గా మారింది. కులవర్ధన్ ఇంట్లోని డ్రమ్ములోకి ఎలా వెళ్ళింది? అన్న ప్రశ్న అందరిని కలచి వేసింది. అంతే.. అప్పటికే నేర చరిత్ర కలిగిన కులవర్ధన్ కోసం గాలింపు మొదలైంది. మదనపల్లె పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా తమ పనులు, వ్యాపారాలు మానుకొని ఆ చిన్నారి మరణానికి కారణం ఏమిటి? అని తెలుసుకోవడానికి కారకుల పైన కక్ష తీర్చుకోవడానికి సంసిద్ధులయ్యారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించారు. ఆ బాలిక మృతదేహం దొరికిన కులవర్ధన్ కుటుంబం ఆధారంగా ఆ యువకుడి కోసం వెతుకులాటను ప్రారంభించారు . హత్యాచార కిరాతక కీచకుడు కులవర్ధన్ ను ఎన్ కౌంటర్ చేసే వరకు మృతదేహాన్ని అప్పగించమని స్థానికులు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించడం పోలీసులకు సాధ్యపడలేదు.

దీంతో సాయంత్రం కడప ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ ఆరంగ్రేటం చేసి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ఖచ్చితంగా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హోం మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ తో ఫోన్ లో మాట్లాడారు. న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఆ వెంటనే పొలీసు బలగాలు మొహరించి జనాన్ని కట్టడి చేయడంతో ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ చిన్నారి మృతదేహం ఉన్న గదిలోకి వెళ్లి ఆధారాలను సేకరించారు. గట్టి పోలీస్ బందోబస్త్ నడుమ చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. బాలిక మృతదేహాన్ని రాత్రి సుమారు తొమ్మిది గంటల పైన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం ఆ బాలిక మృతదేహాన్ని కడప జిల్లా వీరపునాయుని పల్లి మండలం రాగి మాను దిన్నె పల్లెకు పంపించారు.
Self Punishment : నడిరోడ్డులో ఉరి డిమాండ్
బాలిక ను అతికిరాతకంగా హతమార్చిన కులవర్ధన్ ను మాకు అప్పగిస్తేనే బాలిక మృతదేహాన్ని ఇస్తామని స్థానికులు నిందితుడి ఇంటిని చుట్టు ముట్టారు. వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫి, టూటౌన్ సీఐ రాజారెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిన్నారిని ఛిదిమేసిన కులవర్ధన్ ను నడిరోడ్డులో ఉరి తీయాలంటూ నీరుగట్టువారిపల్లె ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు.

దీంతో చెన్నై- ముంబయి జాతీయ రహదారిలో వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయాయి. బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. . నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హోమ్ మంత్రి అనిత చిన్నారి రిషికప్రియ తండ్రి గోపినాథ్ తో మాట్లాడారు. ఎమ్మెల్యే షాజహాన్ బాష స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో తాను అందుబాటులో లేనని, నిందితుడికి ఉరిశిక్ష లేదా జీవితఖైదు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వీడియో రిలీజ్ చేశారు. చిన్నారి ని హత్య చేసిన నిందితున్ని తమకు అప్పగిస్తేనే చిన్నారి మృతదేహాన్ని అప్పగిస్తామని పెద్ద ఎత్తున స్థానికులు తిరుగుబాటు చేశారు.
పోలీసులు చేసిన విశ్వప్రయత్నాలు బెడిసి కొట్టాయి. పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి నిందితున్ని మాకు అప్పగించండి అంటూ పొలీసులతో వాగ్వాదానికి దిగారు. మాబిడ్డను చంపినట్టే వాడిని చంపాలని చిన్నారి బంధువులు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఏమి చేయలేక తలలు పట్టుకున్నారు.
Self Punishment : కుల వర్థన్ స్వీయ శిక్ష స్టోరీ

కిరాత చర్చకు పాల్సడిన కులవర్థన్ పట్ల కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారు. అతడు పోలీసులకు దొరికాడు . ఎదురింటిలో ఉన్న కులవర్ధన్ రాత్రి పాపతో మాట్లాడుతుండటం తాను గమనించానని పాప తాత నరసింహులు పొలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కులవర్ధన్ కోసం ఇంటికి వెళ్లగా గదిలోపల గడియ పెట్టుకుని బయటకు రాకుండా ఉండడంతో తలుపు గడియలు పగలకొట్టి లోనికి ప్రవేశించారు. చూడగా పాప రిషిక శవమై డ్రమ్ములో ఉండగా కులవర్ధన్ పక్కనే కూర్చొని ఉన్నాడు. పోలీసులు వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇక మంగళవారం రాత్రి పోలీసుల కళ్లు గప్పి కులవర్థన్ తప్పించుకున్నాడు.
బుధవారం తెల్లవారుజామున కురభలకోట మండలం కనసానవారిపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని చెరువులో అతని మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో అతడి మృతదేహాన్ని మదనపల్లె ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అతడి తల్లి వచ్చి శవాన్ని చూపి గుర్తించిన కొన్ని నిముషాలతే బెంగళూరు వెళ్లిపోయింది. ఇక కులవర్థన్ స్వీయ శిక్ష వేసుకున్నాడా? లేక చిన్నారిని కులవర్థన్ ఏరీతిలో చంపేశాడో.. అదే రీతిలో మరెవరలో కీచక కులవర్థన్ ను అంతం చేశారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. అతడిది ఆత్మహత్య.. హత్య అనే విషయాన్ని పక్కన పెడితే.. చిన్నారిని అతికిరాతకంగా చంపిన కులవర్థన్ కథ అంతంతో.. జన ఆకాంక్ష నెరవేరినట్టే.
also read : Star Pratyusha Case : సుప్రీం తీర్పు ఓకే Andhra Prabha Analysis
